తెలంగాణ ప్రజలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో అమలు చేసిన 'కుటుంబశ్రీ' మోడల్ను అనుసరించి ఈ పథకాన్ని రూపొందిస్తున్నామని ఆమె తెలిపారు. కేరళలో సర్వే ద్వారా 65 వేల మంది అత్యంత పేదలను గుర్తించి.. వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. తెలంగాణలోనూ అదే తరహాలో అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తిస్తామని వివరించారు.సర్వే తర్వాత ప్రతి కుటుంబానికి వారి అవసరాలకు తగినట్లు సహాయం అందిస్తామని సీతక్క చెప్పారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా చొరవ తీసుకుంటామన్నారు. అంతేకాకుండా.. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు, శ్రీమంతుల సహకారం తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించి కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కొత్త పథకం ద్వారా తెలంగాణను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa