ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలపై రీవ్యూ మీటింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 12:41 PM

పటాన్ చెరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ గారి నివాసంలో ఎంఎల్సీ భూపాల్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారితో ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న అనంతరం...... ఇస్నాపూర్ జగన్నాథ్ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని స్థానిక మహిళా సోదరీమణులతో ముఖ ముఖి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో పదేండ్ల కేసీఆర్ గారి పాలన చూశారు.. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. ఈ మధ్య కొంతమంది పంచాయతీ సెక్రటరీలు, ఉద్యోగులు నా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్లతో నేను ఒక్కటే మాట అన్నా.. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, పర్మినెంట్ చేసింది కేసీఆర్, జీతాలు పెంచింది కేసీఆర్. కానీ ఆయన్ను ఓడగొట్టి కాంగ్రెస్ ను గెలిపించింది మీరే కదా అన్నాను. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు.


కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారు.


రూ. 200 ఉన్న పెన్షన్ రూ. 2000 చేసింది కేసీఆర్. రేవంత్ రెడ్డి రూ. 4000 ఇస్తానని చెప్పి మోసం చేశాడు. 


ఈ 24 నెలల్లో ఒక్కో అవ్వతాతకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 52,000 బాకీ పడింది. అత్తా కోడలు ఇద్దరికీ రూ. 2500 ఇస్తానని చెప్పి ఇద్దరికీ మొండిచేయి చూపించాడు. 


ఉన్న కేసీఆర్ కిట్ బంద్ పెట్టాడు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని ఆశపెట్టి.. కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయల చెక్కును కూడా నెలల తరబడి ఆపుతున్నాడు.


కేసీఆర్ రాకముందు ఇస్నాపూర్‌లో పవర్ హాలిడేస్ ఉండేవి. కేసీఆర్ వచ్చాక 24 గంటల కరెంట్ ఇవ్వడంతో.. ఇక్కడ పరిశ్రమల్లో ఓటీలు దొరికి నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు.ఇప్పుడు మళ్ళీ కరెంట్ కోతలు మొదలయ్యాయి. ఫ్రీ బస్సు అని చెప్పి ఆటో వాళ్ళ పొట్ట కొట్టారు, మగోళ్లకు డబల్ టికెట్ రేట్లు పెట్టి బాదుతున్నారు.కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు. అలాంటి పెద్దమనిషిని పట్టుకుని రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలో పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అని అడిగితే.. నీ లాగుల తొండలు తీస్తా అంటాడు. మహిళలకు 2500 అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటాడు. తులం బంగారం ఏది అని అడిగితే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటాడు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష?బతుకమ్మ చీరలు బంద్, క్రిస్టియన్-ముస్లింలకు ఇచ్చే కానుకలు బంద్, రైతుబంధు బంద్, దళిత బంధు బంద్, గొర్రెల పంపిణీ బంద్.. ఇలా కేసీఆర్ ఇచ్చినవన్నీ బంద్ పెట్టిన బంద్ల బాబు రేవంత్ రెడ్డి.


ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. మీకు అందుబాటులో ఉండే వాళ్లకు, మీ భవిష్యత్తును బాగా చూసుకునే వాళ్లకు ఓటెయ్యాలి. మనకు అన్నం పెట్టిన కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవాలి. ఇస్నాపూర్ అభివృద్ధి కొనసాగాలన్నా, పేదల సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలన్నా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa