ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంకరపట్నంలో యూరియా సమస్యపై రైతులు ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 03:29 PM

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో యూరియా కొరత, ఆన్‌లైన్ బుకింగ్ సమస్యలపై రైతులు జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో చేపట్టారు. స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం, కొందరి వద్ద చిన్న మొబైల్ ఫోన్లు మాత్రమే ఉండటంతో ఆన్‌లైన్‌లో యూరియా బుక్ చేసుకోవడం కష్టమవుతోందని, దీంతో సకాలంలో ఎరువులు అందక పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత విధానంలోనే ఆధార్ కార్డు ద్వారా యూరియా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa