ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్-గోవా గ్రీన్‌ఫీల్డ్ హైవే,,, బెలగావి-రాయచూర్ సెక్షన్‌లో భూసేకరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 22, 2026, 03:20 PM

సరదాగా గడిపేందుకు, ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ నుంచి చాలా మంది పర్యాటకులు గోవాకు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం నగరం నుంచి గోవాకు చేరుకోవాలంటే రోడ్డు మార్గంలో 15-18 గంటలు పడుతోంది. ఈ సమయాన్ని సగానికి పైగా తగ్గించేందుకు కేంద్రం ప్రభుత్వం కీలక ప్రాజెక్టు తెరపైకి తీసుకొచ్చింది. భారత్ మాల పరియోజనలో భాగంగా ఎకనామిక్ కారిడార్-10 నిర్మాణం చేపట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం పనాజీ-హుబ్లీ-కొప్పల్-రాయచూరు-మహబూబ్‌నగర్-హైదరాబాద్ మార్గానికి ప్రత్యమ్నాయంగా జర్నీ సమయాన్ని తగ్గించేందుకు పనాజీ-బెలగావి-రాయచూరు-హైదరాబాద్ మార్గాన్ని ప్రతిపాదించారు.


ఈ కారిడార్‌లో భాగంగా పనాజీ-బెలగావి-రాయచూరు భాగాన్ని గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఫలితంగా గోవా నుంచి కర్ణాటక, తెలంగాణకు మరింత మెరుగైన కనెక్టివిటీ సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్-పనాజీ మధ్య నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్టులో నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిని నిర్మిస్తున్నారు. మొత్తం రూ.12 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోవా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా, వాణిజ్యం, పర్యాటక రంగానికి కొత్త ఊపిరి తీసుకున్నారన్నారు.


ప్రాజెక్టులో కీలకమైన బెలగావి-రాయచూర్ సెక్షన్‌లో ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. హ్యామ్ విధానంలో ఈ రహదారిని నిర్మిస్తుండగా.. పూర్తి అయిన తర్వాత ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. దాంతో పాటు పనాజీ, బెలగావి, రాయచూర్, హైదరాబాద్ నగరాలను కనెక్ట్ చేసే ఈ కారిడార్ ద్వారా సరుకు రవాణాకు ఈజీ అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గోవాకు సుమారు 700 కి.మీ దూరం అయితే కొత్త హైవే వల్ల కనీసం 150 కి.మీ వరకు తగ్గనుంది. ఈ జాతీయ రహదారి పూర్తయితే లాజిస్టిక్స్ ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రాంతీయ వ్యాపారం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు సైతం విస్తరించనున్నారు.


ప్రస్తుతం సూరత్ నుంచి చెన్నై వరకు కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణ పరిధిలోని జోగులాంబ గద్వాల జిల్లాలో భాగంగా ఉంది. ఈ హైవే కూడా పనాజీ-హైదరాబాద్ హైవేకు అనుసంధానంగా మారనుంది. ఫలితంగా మరింత మెరుగైన కనెక్టివిటీకి అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa