గృహవసరాల గ్యాస్ బుకింగ్ సేవలను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇక నుంచి గ్యాస్ బుక్ చేయాలంటే ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి చేసింది. ఇందుకు ఈ నెల 31 వరకు గడువు విధించింది. అప్పటిలోగా వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. ఇది వరకే కేవైసీ పూర్తి చేసుకున్న వారు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. వినియోగదారులు మీ-సేవ, గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa