హైదరాబాద్ నగర పరిధిలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు పోలీస్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన మొత్తం 138 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నియమించేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకు నెలకు రూ.26 వేల వేతనం అందించనున్నారు. రిటైర్డ్ పోలీస్ సిబ్బంది, మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ దళాల్లో పనిచేసిన వారు మాత్రమే అర్హులు అని తెలిపింది. రాతపరీక్ష లేకుండా.. విద్యార్హతలు, స్థానికత, ఉద్యోగ అనుభవం ఆధారంగా నేరుగా ఉద్యోగం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి నివాస ధృవపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ శాఖ తెలిపింది. దరఖాస్తులను సమర్పించేందుకు చివరి తేదీ మార్చి 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అని ప్రకటించింది.
ఇక ఈ హైదరాబాద్ సిటీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల్లో మాజీ సైనికులకు వయసు పరిమితి.. 2026 జనవరి 31వ తేదీ నాటికి 58 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అలాగే గత 2 ఏళ్లలో తమ ఉద్యోగాల నుంచి విరమణ చేసి ఉండాలి. ఇక మాజీ పారామిలిటరీ, రిటైర్డ్ పోలీసు సిబ్బందికి 62 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితిని విధించారు.
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా సంబంధిత విద్యార్హతలు, ఉద్యోగానుభవం, స్థానికత ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 26,000 చొప్పున గౌరవ వేతనం అందించనున్నారు. అయితే వీరికి వేతనంతో కూడిన సెలవులు ఉండవని అధికారులు వెల్లడించారు. ఏదైనా తప్పనిసరిగా విధులకు హాజరు కాకపోతే జీతంలో కోత విధించనున్నట్లు తెలిపారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు వారి డిశ్చార్జ్ బుక్, రిటైర్మెంట్ ఆర్డర్, పాన్ కార్డ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పాస్‌బుక్‌తోపాటు ఒరిజినటల్ ధృవపత్రాలు, ఫోటోలను సమర్పించాల్సి ఉంటుంది. డ్రైవర్ అభ్యర్థులు అయితే లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇక టెక్నికల్ ట్రేడ్‌లు ఉన్నవారు అయితే వారి సర్టిఫికెట్లను సమర్పించాలి. ఈ సర్టిఫికెట్లతోపాటు 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు కూడా అందించాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు హైదరాబాద్‌లోని పేట్లబుర్జ్‌లో ఉన్న సీఏఆర్ ప్రధాన కార్యాలయంలోని ఎస్‌పీఓస్ కార్యాలయానికి స్వయంగా వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఫోన్ కాల్స్ ద్వారా ఎలాంటి దరఖాస్తులు స్వీకరించరని తేల్చి చెప్పారు. అభ్యర్థులు వ్యక్తిగతంగా హాజరై తప్పనిసరి సంబంధిత పత్రాలను అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa