TG: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో అనుమానం పెనుభూతమై ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఓ వ్యక్తి దారుణ హత్యకు దారి తీసింది. మాజీ వార్డు సభ్యుడు సాయిలు, టైలర్ బాలు మధ్య గత ఏడాది క్రితం నుండి సాయిలు తమ కుటుంబంపై చేతబడి చేస్తున్నాడని బాలు అనుమానించాడు. ఈ అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా, బాలు ఇంటికి వెళ్లిన సాయిలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో, బాలు కత్తితో సాయిలు గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa