నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ శివారులోని రాజ్యలక్ష్మి సహితా లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీలలో జరగనున్నాయి. మార్చి 2న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా దేవేంద్రరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ దేవేంద్రరెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన మార్చి 2న జరిగే లక్ష్మీనారాయణ స్వామి అన్నదానానికి లక్ష 5000 రూపాయలు ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa