నల్గొండ ఐటీ టవర్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ఐటీ టవర్ ముందు ఆ సంఘం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ.. ఐటీ కంపెనీలు జిల్లాకు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ నిరసన నల్గొండ జిల్లా, నల్గొండ నియోజకవర్గంలో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa