ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉప్పల్‌లో మైనారిటీ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 11:22 AM

హైదరాబాద్, ఉప్పల్ లో మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ కోర్సులు అందిస్తున్నారు. ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీవర్గాలకు చెందిన 18-35 ఏళ్ల యువత కోసం ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. ల్యాండ్ సర్వేయర్, ఎంఈపీ టెక్నీషియన్, స్మార్ట్ఫోన్ రిపేర్ వంటి కోర్సులలో 3 నెలల పాటు శిక్షణ ఇస్తారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 25 నుండి మార్చి 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుదారులు ఆధార్, విద్యార్హత, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa