రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి ఆలయం పునః నిర్మాణం చేసి.. నూతన ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీరామ పరివారం, పరమ శివుని మరియు నవగ్రహ విగ్రహాలు పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించాను.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయనిపిస్తున్నా, ధర్మ పరిరక్షణను ఒక యజ్ఞంలా భావించి మీరందరూ ముందుకు సాగడం అభినందనీయం. కలియుగంలోనూ ధర్మాన్ని కాపాడే మహోన్నత కర్తవ్యాన్ని భుజాన వేసుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.ప్రజలు తమకు ఉన్నంతలోనే ధర్మ పరిరక్షణ కోసం, మానవ సంబంధాలను పరిపుష్టి చేయడం కోసం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వహించడం నిజంగా గర్వకారణం. ఈ కార్యక్రమాల ద్వారా మన సంస్కృతి, సాంప్రదాయాలు మరియు విశ్వాసాలను భావి తరాలకు అందిస్తున్న భక్తులకు, అర్చకులకు శుభాకాంక్షలు.“ధర్మం నిలిస్తేనే సమాజం నిలుస్తుంది — ఈ ధర్మ పరిరక్షణ యజ్ఞం నిరంతరం కొనసాగాలి” అని ఆకాంక్షిస్తున్నాను.ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు శ్రీమతి భానుక నర్మదా మల్లికార్జున్ గారు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి కొంతం దీపిక నరేష్ గారు, నాయకులు శ్రీ పిట్టల నాగేష్ ముదిరాజ్ గారు, శ్రీ శేఖర్ యాదవ్ గారు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa