అక్రమ నగదు చలామణి దర్యాప్తులో భాగంగా, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ సంస్థపై ఈడీ శుక్రవారం ముంబై, హైదరాబాద్‌తో సహా సుమారు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. బ్యాంకు మోసానికి సంబంధించిన ఈ కేసులో సంస్థ ఉన్నతాధికారుల ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు జరిపిన దర్యాప్తు సంస్థ, కీలక పత్రాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. భారీ ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టిన అధికారులు నిందితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa