ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సావిత్రీబాయి ఫూలే వర్ధంతి: యువత ఆమె ఆశయాలను స్మరించుకోవాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2026, 04:14 PM

దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రీబాయి ఫూలే వర్ధంతిని మంగళవారం రాజేంద్రనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నవయువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి కొంపల్లి జగదీష్, సాంస్కృతిక కార్యదర్శి గోంత్యాల శ్రీనివాస్ ఆమె సేవలను స్మరించుకున్నారు. చదువు ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని, ఆమె బాటలో యువత సామాజిక సేవలో ముందుండాలని కుమారస్వామి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa