యాదగిరిగుట్ట మండలం రామాజీ పేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య పాల్గొన్నారుయాదగిరిగుట్ట పట్టణానికి చెందిన లబ్ధిదారులు దోశెట్టి లలిత - రామచంద్రయ్య గౌడ్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.పట్టుబట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తమకు ప్రభుత్వం కల్పించిన ఈ ఇల్లు కల నిజం కావడంతో ఎంతో ఆనందంగా ఉందని,ఇందుకు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు.ఇల్లు లేని పేదలకు గౌరవప్రదమైన జీవితం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని చెప్పారు.ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు ఎల్లప్పుడూ తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa