రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13న పీఎం కిసాన్ 22వ విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది. మోదీ అసోం పర్యటన నేపథ్యంలో శుక్రవారం గువాహటి వేదికగా నిధులు విడుదల చేస్తారని తెలిపింది. రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తోంది.2019 లో ఎన్డీయే సర్కారు ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా.. ఏటా మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీ మొత్తం రూ.19 వేల కోట్ల నిధులను విడుదల చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు చొప్పున జమ అవుతాయని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa