ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇఫ్తార్ విందు విజయవంతం..యువజన నాయకుడు ఆదిత్యరెడ్డి ధన్యవాదాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 07:29 PM

ఇఫ్తార్ విందు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. స్థానిక ముస్లిం మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.... పవిత్ర రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సౌహార్దానికి ప్రతీక అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు మరియు పాల్గొన్న ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa