దేశంలో అసలు గ్యాస్ కొరత అనేదే లేదని, కొంతమంది కావాలనే లేని కొరతను సృష్టించి ప్రజలను భయపెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితుల వల్ల అనేక దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భారత్‌లో ధరలను నియంత్రణలో ఉంచిందని గుర్తుచేశారు. గతంలో రూ. 1,200 వరకు ఉన్న గ్యాస్ ధరను రూ. 900లకు తగ్గించి సామాన్యుడిపై భారం తగ్గించిన ఘనత కేంద్రానిదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa