ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు ఢీకొని దంపతుల మృతి.. కుమారుడికి గాయాలు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2026, 10:30 AM

TG: పెళ్లి రోజును ఆనందంగా జరుపుకున్న దంపతులు మరుసటి రోజే తమ కుమారుడి కళ్లముందే మృతి చెందిన ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. రాయనగర్‌కు చెందిన మర్రి ప్రశాంత్ (35), భార్య శ్రావణి (33) తమ కుమారుడు సహస్రార్ (12)తో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా, పీర్జాదిగూడ డెకాథ్లాన్ సమీపంలో వేగంగా వచ్చిన కియా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ అక్కడికక్కడే మరణించగా, శ్రావణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.వారి కుమారుడు సహస్రార్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోయి ఆ బాలుడు ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. ప్రమాదానికి కారణమైన కారు యజమాని రామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa