ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయం.. మార్కెట్లోకి భారత్ సొంత గ్యాస్!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2026, 11:02 AM

వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా భారత్ ‘డీఎంఈ’ (డైమిథైల్ ఈథర్) వినియోగంపై దృష్టి పెట్టింది. మిథనాల్ ఆధారంగా తయారయ్యే ఈ వాయువును LPGతో కలిపి లేదా నేరుగా వంట గ్యాస్‌గా ఉపయోగించవచ్చు. బయోమాస్, బొగ్గు, కార్బన్ డయాక్సైడ్ వంటి పదార్థాలతో దీనిని తయారు చేయవచ్చు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సిలిండర్లు, స్టవ్‌లలో పెద్ద మార్పులు లేకుండానే వినియోగించవచ్చు. CSIR-నేషనల్ కెమికల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి పరిశోధనలు చేపడుతున్నారు. ఈ ప్రణాళిక విజయవంతమైతే సామాన్యులకు ఖర్చు తగ్గనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa