ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2026, 12:43 PM

ఆలేరు నియోజకవర్గ రైతాంగ ప్రయోజనాలే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు ఆదివారం సాయంత్రం మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేశారు. నియోజకవర్గంలోని చెరువులు,కుంటలను నింపే ప్రక్రియలో భాగంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారు.స్వయంగా మల్లన్న సాగర్‌ను సందర్శించి,ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లను ఎత్తారు.ఆలేరు నియోజకవర్గంతో పాటు పొరుగున ఉన్న ఇతర నియోజకవర్గాల్లోని ఎండిపోయిన చెరువులను నింపడమే లక్ష్యంగా ఈ నీటి విడుదల జరిగింది.నీటి విడుదల సందర్భంగా జల దేవతకు ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు నిర్వహించి,నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.​ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం.ఎండకాలంలో రైతాంగం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మల్లన్న సాగర్ నుండి చెరువులను నింపే కార్యక్రమాన్ని చేపట్టాం.


​గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి,మన నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం.ఈ నీటి విడుదలతో నియోజకవర్గంలోని భూగర్భ జల మట్టం పెరగడంతో పాటు,వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది.రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానని ఎమ్మెల్యే గారు తెలిపారు.​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నీటిపారుదల శాఖ అధికారులు మరియు నియోజకవర్గ రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa