ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్కాజిగిరి కార్పొరేషన్‌కు రూ.98 కోట్ల నూతన భవనం : మేడ్చల్ అభివృద్ధికి భారీ ఊతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2026, 04:02 PM

ఈ రోజు స్థలాన్ని పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్,మాజీ యంపీ మధు యాష్కీ గౌడ్,మందముల పరమేశ్వర్ రెడ్డి,తదితరులు పరిశీలించారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు నూతన కార్యాలయ భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.98 కోట్ల నిధులను మంజూరు చేయడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది.ఈ నిర్ణయం జిల్లాలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నదిగా భావిస్తున్నారు.ప్రభుత్వం ఈ కొత్త కార్పొరేషన్ కార్యాలయాన్ని అన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఉప్పల్ భగయత్ ప్రాంతంలో సుమారు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.


మంగళవారం ఈ స్థలాన్ని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ తోటకూర వజ్రెష్ యాదవ్ గారు,మాజీ యంపీ,ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జీ మధు యాష్కీ గౌడ్ గారు,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ మందముల పరమేశ్వర్ రెడ్డి గారు,జిహెచ్ఎంసి మాజీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు,మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు,సీనియర్ నాయకులు రాపోలు రాములు గారు,బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారు,మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు,తదితరులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన దృష్టి ఉందని పేర్కొన్నారు.


ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా మారి,ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించిన ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గారికి,టిపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి,మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి,రాజ్యసభ సభ్యులు


వేం నరేందర్ రెడ్డి గారికి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.స్థానికుల అభిప్రాయం ప్రకారం,ఈ ప్రాజెక్ట్ మేడ్చల్ జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధికి దోహదం చేయడంతో పాటు,భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.


 ఈ కార్యక్రమంలో GHMC మాజీ ఫ్లో లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ,బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, చర్లపల్లి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి,మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్,మల్కాజ్గిరి,నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధుల, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa