ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంజాన్ పండుగ సందర్భంగా పటాన్‌చెరులో రంజాన్ తోఫాల పంపిణీ – మాద్రి పృథ్వీరాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 20, 2026, 03:04 PM

 పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీ, నాగులమ్మ గడ్డ, రాఘవేంద్ర కాలనీ, బఖత్ గల్లీ, లక్కడోడి, నేతాజీ నగర్, మార్క్స్ నగర్, వెంకటేశ్వర కాలనీ, గోనెమ్మబస్తీలలో ఉన్న ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్ఎస్ నాయకులు , MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూ, పండుగల సందర్భంగా అవసరంలో ఉన్నవారికి సహాయం అందిస్తున్నామని తెలిపారు.దసరా, క్రిస్మస్, రంజాన్ వంటి పర్వదినాలను కులమతాలకు అతీతంగా జరుపుకుంటూ, సమాజంలో ఐక్యతను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.పండుగ అంటే కేవలం ఆనందం మాత్రమే కాదు – అవసరంలో ఉన్నవారితో ఆ ఆనందాన్ని పంచుకోవడం నిజమైన పండుగ అని ఆయన అన్నారు.ప్రజల కోసం, ప్రజల మధ్యలో కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమాలకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa