ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్‌ఐవీ రాకున్నా సూటిపోటి మాటలు చంపాయి: యువతి సూసైడ్ నోట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 11, 2026, 10:30 AM

TG: ప్రియుడు HIV/AIDS రక్తం ఎక్కించిన ఘటనలో బాధితురాలు సమాజంలో ఎదురైన అవమానాలు, సూటిపోటి మాటలు తట్టుకోలేక చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ‘‘అతడితో పెళ్లి వద్దని అమ్మానాన్న చెప్పారు. హెచ్‌ఐవీ అంత ప్రమాదమని నాకు తెలియదు. ఇంట్లోవాళ్లంతా చెప్పాక హెచ్‌ఐవీ ఎంత సీరియసో తెలిసింది.. అమ్మా క్షమించు.. నువ్వు కష్టపడి చదివించినా నా జీవితం నాశనం చేసుకున్నా. మరో జన్మ ఉంటే నీ కడుపులోనే పుట్టాలని కోరుకుంటున్నా. గౌరవం, విలువ పోయాక బతకడం బాగాలేదు’’ అంటూ లేఖలో తన వేదన పంచుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa