ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే : నీలం మధు ముదిరాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 11, 2026, 12:41 PM

మనుషులంతా అన్ని రంగాల్లో సమానత్వంతో జీవించాలని, ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తన జీవితాన్ని ధారపోసిన భారతీయ సామాజిక తత్వవేత్త, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని, ఆయన ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్పూర్తిదాయకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి  నీలం మధు ముదిరాజ్  అన్నారు. శనివారం చిట్కుల్ లోని ఆయన నివాసంలో మహాత్మా జ్యోతిబా పూలె 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలె చిత్ర పటానికి నీలం మధు పూల మాల వేసి నివాళ్లు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక దార్శనికుడుగా, సంఘసంస్కర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన మహనీయుడు ఫూలే అన్నారు. వివక్షలేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా ఫూలే అని కొనియాడారు. పూలే ఆశయాలు, ఆశలకు అనుగుణంగా సంబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా  అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా దశాబ్దాలుగా ప్రజల న్యాయబద్ధ డిమాండ్లైన బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa