తెలంగాణలో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44°C దాటే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భానుడి ప్రభావం అధికంగా ఉండనుందని పేర్కొంది. హైదరాబాద్లో కూడా వరుసగా 10 రోజుల పాటు 40-41°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa