భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలోని చిత్రకూటమండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో దేవస్థానానికి రూ.86,02,047 ఆదాయం వచ్చింది. బంగారం 90 గ్రాములు, వెండి 100 గ్రాములు, అమెరికా డాలర్ 331, ఒమన్ 2 రియాల్స్, మలేషియా 10 రింగిట్, నేపాల్ 10 రూపాయలు, యూఏఈ 35 దిర్హామ్‌లు, ఇండోనేషియా 500 రూపీ, కువైట్ 47 1/2 దినార్, కెనడా 10 డాలర్లు, సౌదీ 40 రియాల్స్. ఈ హుండీని ఎట్టకేలకు జూలై 6న లెక్కించగా రామయ్యకు 70 రోజులకుగాను మొత్తం రూ.86,02,047 ఆదాయం వచ్చింది.