స్మార్ట్ఫోన్లలో ఐదు యాప్‌లను తొలగించాలంటూ నెదర్లాండ్‌కు చెందిన థ్రెట్ ఫ్యాబ్రిక్ అనే సంస్థ హెచ్చరించింది. ఆ యాప్స్‌లో కొత్త ట్రోజన్ మాల్వేర్ను గుర్తించామని, అది యూజర్ బ్యాంకింగ్ లాగిన్ సమాచారం, ఖాతా నంబర్, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కొల్లగొట్టే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో 1.ఫైల్ మేనేజర్ స్మాల్, లైట్ 2. మై ఫైనాన్సెస్ ట్రాకెర్ 3.కోడిక్ ఫిస్కేల్ 2022 4.జెట్టర్ అథెంటికేటర్, 5. రికవర్ ఆడియో, ఇమేజెస్, వీడియోస్ అనే యాప్‌లు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని హెచ్చరించింది.