రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నూతన మార్గదర్శకాలు జారీచేసింది. రాత్రి వేళల్లో రైలు బోగీలో ఏ ప్రయాణికుడు కూడా గట్టిగా మాట్లాడొద్దని, స్పీకర్ పెట్టి పాటలు వినొద్దని పేర్కొంది. అలా చేస్తే తీవ్రతను బట్టి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రైల్వే ఎస్కార్టు, మెయింటెనెన్స్ స్టాఫ్ కూడా గట్టిగా అరవద్దని వివరించింది. రాత్రి 10 తర్వాత టీటీఈ టికెట్‌ను తనిఖీ చేయొద్దని మార్గదర్శకాల్లో పేర్కొంది.