భారత్ లో ట్విట్టర్ సేవల్లో అంతరాయం కలగడంతో యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పలువురు యూజర్లు తాము లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ట్విట్టర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ట్విటర్ డౌన్ అయినట్లు చూపిస్తోందని యూజర్లు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ సమస్య మొదలైంది. ఉదయం కొన్ని గంటల పాటు లాగిన్ సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత ట్విట్టర్ సేవలు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయి.