ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా మరియు ఆరోగ్యము అను అంశంపై అవగాహన సదస్సు శుక్రవారం ఉదయం ప్రిన్సిపాల్ డా.హర్షలతా పంకజ్ అధ్యక్షతన జరిగింది. ప్రముఖ యోగా విద్యా గురువులు జంగమయ్య మాట్లాడుతూ తొలిశ్వాస నుండి చివరిశ్వాస వరకూ నోటితో చేసే క్రియలు ఆహారం తీసుకోవడం మాటలను నియంత్రణ అవసరం అన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మరియు ప్రముఖ దాత డాక్టర్ కె. బయారెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మిక గురువు అని ఎందుకు అంటారో వివరించారు.
ప్రముఖ యోగా గురువులు ఓబయ్య మాస్టర్, పిరమిడ్ ధ్యాన కేంద్రం, ప్రపంచ పౌరులలో భారతీయులు అత్యంత అదృష్టవంతులు అని తెలిపారు. ధ్యాన భూమి అయిన భారతదేశంలో ధ్యానాన్ని ప్రతిఒక్కరూ చేయవలసిన అవసరం ఉంది అన్నారు. ధ్యాన మహత్తును హృదయానికి హత్తుకునేలా వివరించి 30 నిముషాలు ధ్యానం చేయించారు.