పాలకొండ. గత ఏడాదిలో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ ఈ ఏడాది రైతులకు మద్దతు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు కండపు ప్రసాదరావుతోపాటు రైతులు సబ్ కలెక్టర్ నూరల్ కమార కు వినతి పత్రం శుక్రవారం అందజేశారు. గత ఏడాది మిల్లర్లు, దళారులు దోపిడీతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ ఏడాది రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి రవాణా చార్జీలు, మద్దతు ధర సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఆ వినతిపత్రంలో కోరారు. దీనికి ముందుగా రైతులు, మిల్లర్లు, వ్య వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఆయనతోపాటు రైతులు కే. ప్రకాష్ రావు, ఎన్. ప్రసాద్ రావు, పి. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.