జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ కర్నూలులో నవంబర్ 26 నుండి 29 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్ కి బాలురు నుండి ముగ్గురు మరియు బాలికలు ఒక్కరూ ఎంపిక అయ్యారని రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సీఈఓ. సి. వెంకటేశులు నుండి ఉత్తర్వు వచ్చాయని జిల్లా సాఫ్టబాల్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు స్టేట్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ కలిదిండి నరసింహారాజు, సెక్రటరి సిగిలిపెల్లి లక్ష్మీదేవి శుక్రవారం తెలియజేసారు. ఎంపిక అయినా క్రీడాకారులు వై లక్ష్మి ప్రసాద్, ఎం యస్వంత్, ఏ మనోజ్ కుమార్ మరియు టీ దివ్య. ఈ క్రీడాకారులు కి ఈ నెల 6వ తేదీ నుండి 24 వ తేది వరకు ఆర్ డి. టి స్టేడియం అనంతపురంలో కోచింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు. వీరి ఎంపిక పట్ల జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, సెక్రటరి పి సుందరావు, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కన్వీనర్ కలిదిండి వెంకటరామరాజు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎం వి రమణ, సెక్రటరి ఎం సాంబమూర్తి, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎం తిరుపతి రావు అభినందనలు తెలియజేసారు.