భారతదేశంలో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్ రిలయన్స్ జియో అని బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అంతర్గత విశ్లేషణా సంస్థ తెలిపింది. దుస్తుల విభాగంలో అడిడాస్, వాహన విభాగంలో బీఎండబ్ల్యూ, ఎలక్ట్రానిక్స్లో ఎల్జీ, గాడ్జెట్లలో ఎంఐ, ఆరోగ్య సంరక్షణలో హిమాలయ, ఆతిథ్యంలో ఐటీసీ హోటల్స్, తయారీలో ఏసీసీ, రిటైల్లో కేఎఫ్సీ, టెక్నాలజీ విభాగంలో డెల్ అగ్రస్థానాలు పొందినట్లు నివేదికలో పేర్కొంది.