దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి ఇండియా మరో కొత్త కారును లాంచ్ చేసింది. తమ కంపెనీ ప్రముఖ మోడల్ ఆల్టో కారులో CNG వేరియంట్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర రూ.5.95 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. కాగా, ఈ సరికొత్త K10-CNG వేరియంట్ లో 1 లీటర్ ఇంజన్ అమర్చారు. ఇది 41.7KW గరిష్ట శక్తిని, కేజీ గ్యాస్ కు 33.85 కి.మీ మైలేజీని అందిస్తుందని మారుతి తెలిపింది.