ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్‌కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా 30 వేలకు పైగా వాహనాలను రీకాల్ చేసింది. ఇటీవల విడుదల చేసిన మోడల్ ఎక్స్ కార్లలో ఎయిర్‌బ్యాగ్ అమరికలో లోపాలు ఉన్నాయని కంపెనీ గుర్తించింది. వాహనాలలోని లోపాలు ఉన్న భాగాలను రిపేర్/రీప్లేస్ చేయడానికి టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు టెస్లా షేర్లు దాదాపు 3 శాతం క్షీణించి రేండేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి.