నిద్రలేమి సమస్యకు ‘బనాలా లైఫ్’ అనే బ్యాంకాక్ కంపెనీ ఐసోక్రానిక్ సౌండ్ టెక్నాలజీతో పనిచేసే ‘బనాలా సెన్స్’ అనే పరికరాన్ని తయారు చేసింది. ఇందులో ఫోకస్ మోడ్, ఫీల్ గుడ్ మోడ్ అనే రెండు మోడ్స్ ఉంటాయి. నిద్రపోయే ముందు దీనిని తలగడకు దగ్గరగా పెట్టుకుని, కావలసిన మోడ్ను ఎంపిక చేసుకుని ఆన్ చేసుకుంటే నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్రపడుతుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 53 డాలర్లు (రూ.4331).