ప్రజలంతా డిజిటెల్ చెల్లింపుల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే చెల్లింపుల వేళ నెట్వర్క్ సమస్యలు వేధించకుండా ఆఫ్లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీనికోసం మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి. తరువాత మీ బ్యాంకు పేరు ఎంచుకుని కావాల్సిన ఆప్షన్ సెలక్ట్ చేసుకోవటం ద్వారా ఆఫ్లైన్ సేవలు పొందొచ్చు.