ట్విట్టర్ కు దేశీయంగా రూపొందిన ‘కూ’ యాప్ కు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోంది. 2 రోజుల క్రితం ఈ యాప్ బ్రెజిల్ లో విడుదల చేయగా.. 48 గంటల్లో 10 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్థానిక భాషలు మాట్లాడే వారికి మరింతగా సేవలు అందించేందుకు యాప్ ను అభివృద్ధి చేస్తున్నారు. భారత్ లో 50 మిలియన్ల మంది ‘కూ’ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు.