ఇటలీకి చెందిన స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబోర్గినికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఈ కార్ల ధర కోట్ల రూపాయల్లో ఉన్నా ఎగబడి మరీ కొంటుంటారు. తాజాగా లంబోర్గిని భారత మార్కెట్లోకి లంబోర్గిని ఉరుస్ పెర్ ఫార్మనేట్ పేరుతో నూతన మోడల్ ను విడుదల చేసింది. కాగా, ఈ కారు ప్రారంభ ధర రూ.4.22 కోట్లు(ఎక్స్ షోరూం) అని కంపెనీ వెల్లడించింది. ఈ సూపర్ కారు కేవలం 3.3 సెకన్లలోనే 100 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. కాగా, భారత్ లో లంబోర్గనీ బ్రాండు విస్తరణకు ఉరుస్ కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు.