దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయంసెన్సెక్స్ 64 పాయింట్ల నష్టంతో 62,208 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 18,467 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.67 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్‌అండ్‌టీ, మారుతీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, SBI, NTPC షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్,TCS, ఏషియన్ పెయింట్స్, HUL, డాక్టర్ రెడ్డీస్, టైటన్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.