కేంద్ర ప్రభుత్వం వివధ రకాల పథకాలతో ప్రజలకు అనేక లాభాలు చేకూరుతున్నాయి. అలాగే కేంద్రం అందించే ఇన్సూరెన్స్ పథకాల్లో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఒకటి. ఈ పథకం ద్వారా ప్రీమియం చెల్లింపుతో రూ.2 లక్షల వరకు జీవిత బీమా కవరేజ్ పొందేందుకు వీలుంటుంది. ఒకవేళ పాలసీ దారుడు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 2 లక్షలు లభిస్తాయి. ఈ స్కీమ్ లో చేరితే ఏడాదికి రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. 18 నుంచి 50 ఏళ్ల వయసు వున్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్‌లో చేరాలంటే బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డు తప్పనిసరి.