తన బాయ్ ఫ్రెండ్ కి వీడియో కాల్ చేస్తే వేరే మహిళ ఫోన్ తీసిందనే కోపంతో బాయ్ ఫ్రెండ్ ఇంటికే నిప్పు పెట్టింది ఓ యువతి. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ లో ఈ నెల 20న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా ఇంట్లోని వస్తువులను దోచుకెళ్లింది. ఈ ఘటనలో రూ.40 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. నిందితురాలు మేరీ సాటో(23)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియో కాల్ ఎత్తిన మహిళ మేరీ బాయ్ ఫ్రెండ్ బంధువని తెలుస్తోంది.