మేషం
వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. పాతమిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి.
వృషభం
నూతన వాహన యోగం ఉన్నది.స్థిరస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.
మిధునం
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
కర్కాటకం
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి.
సింహం
ఇంటాబయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.
కన్య
దూరపు బంధువులను కలుసుకుని వివాహ విషయమై చర్చ చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడగలుగుతారు.
తుల
దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి.
వృశ్చికం
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
ధనస్సు
వ్యాపారాల విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.
మకరం
కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
కుంభం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాల సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
మీనం
చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.