డిసెంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పార్నపల్లె పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై జిల్లా కలెక్టర్ వి. విజయరామ రాజుతో కలిసి పోలీసు అధికారులకు జిల్లా ఎస్. పి అన్బురాజన్ పలు సూచనలు చేశారు. లింగాల మండలం పార్నపల్లె సమీపంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. డ్యామ్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని జిల్లా ఎస్. పి ఆదేశించారు. జిల్లా ఎస్. పి వెంట ఏ. ఆర్ డి. ఎస్పీ రమణయ్య, పులివెందుల డి. ఎస్. పి శ్రీనివాసులు, ఎస్. బి ఇన్స్పెక్టర్ వెంకట కుమార్, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.