ఎలాంటి ఘర్షణలకు దిగకుండా అందరు కులమతాల కతీతంగా పండుగలు, ఉత్సవాలు శాంతి యుతంగా జరుపుకోవాలని జమ్మలమడుగు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట కొండారెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పి అన్బురాజన్, ఆదేశాల మేరకు వేపరాల మరియు దొమ్మర నంద్యాల గ్రామాల్లో మైలవరం పోలీస్ సిబ్బంది, వేపరాల దొమ్మర నంద్యాలగ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు మత పెద్దలు ప్రజలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అన్ని కులాల మతాల పెద్దలు ప్రజలతో కలిపి శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని శాంతి భద్రతలకు భంగం కలిగితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఆర్థిక నేరాలైన సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, లోన్, ఉద్యోగాలు ఇప్పిస్తామని చేస్తున్న మోసాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గ్యాంబ్లింగ్, మట్కా, మద్యం, గంజాయి వంటి వాటి పై బానిస కాకుండా కుటుంబ జీవితం నాశనం చేసుకోకుండా ఆరోగ్యకర జీవితం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.