అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలికను పరీక్షించిన డాక్టర్లు షాక్ అయిపోయారు. ఆ బాలిక పొట్ట నిండా వెంట్రుకలు ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. ఈ షాకింగ్ ఘటన చైనాలో చోటుచేసుకుంది. షాన్క్సీ ప్రావిన్స్‌కు చెందిన ఓ బాలిక పికా అనే రుగ్మతతో బాధపడుతోంది. ఈ వ్యాధి ఉన్న వారు మట్టి, పేపర్లు వంటివి తింటుంటారు. ఈ బాలిక మాత్రం తన తలపై వెంట్రుకలను తానే తినడం అలవాటుగా మార్చుకుంది. ఆస్పత్రిలో చేరే సమయానికి బోడి గుండుతో ఉన్న ఆ బాలికను పరీక్షించిన వైద్యులు.. పొట్ట నిండా వెంట్రుకలు ఉండడాన్ని గుర్తించారు. సుమారు రెండున్నర గంటల పాటు శస్త్ర చికిత్సచేసి ఆమె పొట్టలోంచి 3 కేజీల వెంట్రుకలను వెలికితీశారు.