మండల కేంద్రమైన చెన్నూరులో సోమవారం కమలాపురం శాసనసభ్యుడు పి రవీంద్రనాథ్ రెడ్డి డ్రైనేజీ సిమెంట్ రోడ్లు పనులకు ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ మంగళవారం చెన్నూరు కొత్త రోడ్డు నుంచి డ్రైనేజీ పనులకు ప్రారంభించడంతో త్రాగునీటి పైప్ లైన్ లు ఉన్నపలంగా పగిలిపోవడంతో ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మండల అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఒకవైపున వేయవలసిన డ్రైనేజీని కేబులు మరియు త్రాగునీటి పైపులైనున్నచోట డ్రైనేజీకి తవ్వకాలు తవ్వడంతో పూర్తిగా త్రాగునీటి పైపులైన్లు ధ్వంసమయ్యాయి.
ఈ విషయంపై మండల ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరు, పిఆర్ ఇంజనీరుతో కోరగా డ్రైనేజీ పనులను మరో రోడ్డు ప్రక్క ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈ విషయాన్ని కమలాపురం శాసనసభ్యుడు పి రవీంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు వారు తెలిపారు.