సీనియర్ సిటిజన్ల కోసం కెనరా బ్యాంకు ప్రత్యేక బ్యాంకు ఖాతాను ఆఫర్ చేస్తోంది. జీవన్ ధారా పేరుతో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను ఓపెన్ చేస్కోవచ్చు. అరవై ఏళ్ల పైబడిన వారు ఈ ఖాతా తెరిచి ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఖాతాలో వార్షికంగా సగటున రూ.1700 బ్యాలెన్సును మెయిటేన్ చేస్తే, ఖాతాలో ఉన్న సొమ్ముకు బ్యాంకు ఏటా 4 శాతం వడ్డీ చెల్లిస్తుంది. ఉచిత డెబిట్ కార్డుతో పాటు చెక్ బుక్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉచితంగా అందిస్తుంది. కెనరా పెన్షన్ ప్రోడక్ట్ కింద నెలవారీ పెన్షన్‌కు 10 రెట్లు లేదా గరిష్ఠంగా రూ. 2 లక్షల రుణం తీసుకోవచ్చు. ఇక పెన్షన్ ఖాతాగా ఉపయోగిస్తే రూ. 2 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. లాకర్ తీసుకునే సమయంలో జీవన్ ధారా ఖాతాదారులు 25 శాతం డిస్కౌంట్ పొందొచ్చని అధికారులు తెలిపారు.