బాపట్ల జిల్లా విజిలెన్స్ అధికారులు శుక్రవారం పర్చూరు నియోజకవర్గం లోని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలు జరుగుతుందో పరిశీలించారు. కారంచేడు మండలం దగ్గుబాడు మండల పరిషత్ పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్లు పెట్టకపోవడం విజిలెన్స్ సీఐ శ్రీహరి దృష్టికి వచ్చింది. ఈ విషయమై స్కూల్ హెడ్మాస్టర్ తో పాటు ఎంఈఓ సత్యన్నారాయణ ను ఆయన ప్రశ్నించగా కాంట్రాక్టర్ గుడ్లు సరఫరా చేయడం లేదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులకు ప్రభుత్వం మెనూ ప్రకారం ఆహారం పెట్టవలసిందేనని ఆయన ఆదేశించారు.
అలాగే ఇంకొల్లు మండలం పూసపాడు పాఠశాలలో కూడా విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విద్యార్థులందరికీ గుడ్లు ఇవ్వకుండా కొందరికే ఇస్తున్నట్లు వారు గుర్తించారు. గుడ్లు తక్కువగా వచ్చినందువల్ల ఉన్నంతవరకు సర్ది పెడుతున్నామని హెడ్మాస్టర్ విజిలెన్స్ అధికారులకు వివరణ ఇచ్చారు. కాగా ఈ విషయాలన్నిటి పైనా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తానని సీఐ శ్రీహరి చెప్పారు