భోజనంలో పెరుగు లేనిదే కొందరికి అసలు తిన్నట్టే ఉండదు. అయితే పెరుగు తినేందుకు కూడా ఓ నిర్దిష్ట సమయం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. ఓ కొత్త అధ్యయనం ప్రకారం పెరుగును భోజనానికి ముందే తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు. అలాగే చలికాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు వస్తాయనేది కేవలం అపోహ మాత్రమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పెరుగులో ఉండే విటమిన్స్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అనేక రుగ్మతలు నివారిస్తాయని చెప్పారు.